వెనక గది నుంచి పెద్ద పెట్టున ఏడుపులు వినిపించాయి. నేను ఉలిక్కిపడ్డాను. ముందు గదిలో ముందు నెల పేపర్ చదువుతూ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ అప్ డేట్ చేసుకుంటున్న నేను వెంటనే పేపర్ అక్కడ పడేసి వెనక గది లోకి వెనక గదిలోకి పరిగెట్టాను. మా నాయనమ్మ అక్కడ ఉన్న వాళ్ళందరికి నాయకత్వం వహిస్తూ పెద్ద పెట్టున ఏడుస్తోంది. నాకు ఏమి జరిగిందో, ఎవరికి ఏమైందో అర్ధం కాలేదు. ఎవరినైనా అడుగుదాం అనుకున్నా వాళ్ళని ఆ పరిస్థితిలో చూసి అడగటానికి భయం వేసింది. అదే సమయం లో పక్కింటి లోంచి, ఎదురింటి లోంచి, వెనకింటి లోంచి కూడా కోరస్ గా ఏడుపులు వినిపించాయి. ఆహా ఏం కో-ఆపరేషను. ఎంత ఎంత పక్క పక్క ఇళ్ళలో ఉంటే మాత్రం ఏడవడం లో కూడ మరీ ఇంత తక్షణ సహాయమా? ఇంతలో మా నాయనమ్మ ఒకేసారి ఏడుపు లెవెల్ పెంచింది. "ఓరి మాయదారి దేవుడో! అప్పుడే తీసుకెళ్ళిపోయావా?" అని పెద్దగా ఏడవడం మొదలెట్టింది. అక్కడ కూర్చున వాళ్ళు కోరస్ గా పెద్ద పెట్టున ఏడుపు సౌండ్ పెంచారు.
అప్పుడు లోపలికి వెళ్ళి చూద్దున కదా! నా ఫ్యూజ్ ఎగిరిపోయింది. వాళ్ళు ఏడుస్తున్నది ఎవరో దగ్గరి వాళ్ళకి ఏదో అయినందుకు కాదు, టి.వి. లో వస్తున్న "ఋతు రాగాలు" సీరియల్ లో ఏదో పాత్ర ( రాజీవ్ కనకాల అనుకుంటా) చనిపోయినందుకు!!. ఎవరికి ఏమి కాలేదన్న కొంచెం ఆనంద పడినా, నాకు జీవితం మీద విరక్తి మొదలయ్యింది. అప్పటికి మా నాయనమ్మ కి, సీరియల్స్ మిస్ అవ్వకుండా ఒక "బ్రేక్" లో వంట చేసి, ఇంకో "బ్రేక్" లో తిండి పెట్టడం లాంటి కళలలో చేయి తిరిగిపోయిందని తెలుసు కాని, మరీ ఇంతలా సీరియల్స్ పాత్రలని ఇంట్లో వాళ్ళలా ఫీల్ అయిపోతుందని నాకు అప్పుడే తెలిసింది.
అసలు "ఋతు రాగాలు" కొంచెం ఫరవాలేదు. నా జీవితం లో కొద్దో, గొప్పో ఫాలో అయిన సీరియల్ అదే. చివరిలో సీరీయల్ ని సాగదీయడం. "దేవదాస్ కనకాల" పాత్ర మృతృయుంజయుడులా ఎన్ని తరాలైనా అంతే యవ్వనంతో ఉండటం లాంటి కొన్ని విషయాల వల్ల చూడటం మానేసాను.
ఇంకొన్ని సీరియల్స్ అయితే మరీ ఘోరం. ఎపిసోడ్ మొదలయ్యెప్పుడు "టైటిల్ సాంగ్" ఒక 5 నిముషాలు, "జరిగిన కధ" ఒక 5 నిముషాలు, అయిపోయెప్పుడు మళ్ళి "టైటిల్ సాంగ్" 5 నిముషాలు, ఇలా 15 నిముషాలు, 30 నిముషాల సీరియల్ టైం లో పోగా. మిగతా 15 నిముషాలలో సీరీయల్ ని సాగదీయడానికి వీలయినంత కృషి చేస్తుంటారు. కింద గది లో ఫోన్ మోగుతూంటుంది. 26 మెట్లున్న మేడ దిగడానికి మెట్టుకి 30 సెకన్ల చొప్పున 13 నిముషాలు పడుతుంది. ఇంకో 2 నిమిషాలు ఫోన్ తీయాలా? లేదా? అని పాత్ర తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపుల కెమేరాని ఎడం వైపు పది నుంచి సార్లు, కుడి వైపు నుంచి పది సార్లు , పై నుంచి పది సార్లు , కింద నుంచి పది సార్లు చూపిస్తారు. ఇన్ని సార్లు చూసి మనకి కళ్ళు తిరుగుతుండగా పెద్ద సౌండ్ తో "టైటిల్ సాంగ్" మొదలు అవుతుంది. "తరవాయి భాగం రేపు" అన్నమాట. ఫోన్ తీస్తాడా? తీయడా? అనే సస్పెన్స్ మనకి బోనస్. ఈ సస్పెన్స్ తో ఈ సారి మనకి బుర్ర కూడా తిరుగుతుంది. ఇంకా మనం బతుకుంటే తర్వాత సీరీయల్ చూసె సహనం సారీ!! కెపాసిటీ మనకి వచ్చేసినట్టే. అత్త కోడళ్ళ సీరియల్స్ అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు.
మన టి.వి. వీక్షకుల సహనం చూసిన తరవాత నాకు కూడ "జీడి పాకం" అనే సీరియల్ తీద్దామని ఉంది !!! కధ కొంచెమైనా లేకుండా సీరియల్ ని "బబుల్ గం" లాగా సాగదీసే సామర్ధ్యం ఉన్న ఉత్సాహవంతులైన రచయితలకి ఇదే నా ఆహ్వానం. ఇంతకు ముందు "జీళ్ళు" తయారుచేసిన వారికి ఫ్రిపరెన్స్ ఇవ్వబడును.
26, జులై 2008, శనివారం
"రాగాల" ఋతువు
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
8 Comments:
మీరి0త ఘోరానికి పాల్పడతారని నేనస్సలు అనుకోలేద0డి.ఏదో బ్లాగు లోక0లో మా మానాన మేము బ్రతుకుతు0టే సీరియల్ తీద్దామ0టూ జనాలని నరక0లో కి లాగుతారా?
"జీడి గం పాకం బబుల్ "- త్వరలో మన తెలుగు సీరియల్....మీ సీరియల్ లో టైమ్ డిజన్ బావుంది, వేటి వేటి కి ఎన్ని నిమిషయాలు అని , మంచి స్మూక్ష వీక్షకులు లా ఉన్నారే... టపా ఓపినింగ్ బావుంది వెంటనే చదావాలని పించింది, మొదటి పేరా కేక, నాకు తెలిసి మహాభారత్ తరువాత దూరదర్శన్కు కూసింత పేరు తీసుకొచ్చిన సీరియల్ ఋతురాగాలు... అవునండీ బ్రహ్మీగారు బానే ఉంది మరి మీ పేరో
హిహిహి... ఏక్తా కపూర్ అంత ఖ్యాతి (??) మీకూ రావాలని కోరుకుంటూన్నాను!!
ముందు గదిలో కూచుని..ముందు..నెల పేపర్..చదువుతూ..
సూఊఊఊఊఊఊఊఊఊఒపర్..
అష్విన్ గారు అన్నట్టు..టైమింగ్స్..బా..రాసారు..
మన..ఈ జీడిపాకం..సీరియల్..సూఊఊఊఊఊపర్..హిట్..
అవుతుందని...నా..నమ్మకం..నా,,,పూర్తి సహకారం..మీకు
ఉంటుంది..బ్రహ్మి గారు..
@Purnima గారు,
@మీనాక్షి గారు,
చాలా చాలా థాంక్సండి!
నిజం చెప్పాలంటే నేను రాసిన 3-4 టపాలకే నేను ఊహించినదానికంటే చాలా ఎక్కువ స్పందన, ప్రోత్సాహం లభిస్తున్నాయి. నేను బాగా బ్లాగినా, బ్లాగకపోయినా నా సోది చదివి బ్లాగులోకం ఇస్తున్న వ్యాఖ్యలు, సలహాలు, సద్విమర్శలే నా చేత మళ్ళీ మళ్ళీ టపాలు వ్రాయిస్తున్నాయి.
బ్లాగు లోకానికి వందనాలు.
@radhika గారు,
నేను ఘోరానికి పాల్పడటం లేదండి బాబు. తెలుగువారందిరిని అలరించే సీరియల్ తీద్దాం అనుకుంటున్నా!!. కాకపోతె కొంచెం ఎక్కువ కాలం ఓ పదేళ్ళు అలరిద్దాం అనుకుంటున్నా. అంతే!!!
@అశ్విన్ బూదరాజు గారు,
శీర్షికల కోసం శీర్షాసనాలు వేస్తున్నాండి !! "బగ్గు" వద్గీత శీర్షిక కి ముందు 7 శీర్షికలు అనుకొని చివరికి అలా ఫిక్స్ అయ్యాను. అలాగే ఓపెనింగ్ కి కూడ కొంచెం కష్టపడుతున్నా.
బ్రహ్మి నా "కీబోర్డ్ పేరు" అండి .మరి కలంతో వ్రాస్తే కలం పేరు, కీబోర్డ్ తో రాస్తే కీబోర్డ్ పేరు కదా. అయ్య బాబోయ్! నేను కూడా ఒక కొత్తపదం కనిపెట్టేసానోచ్, నా అసలు పేరు చందు అండి. అయినా "బ్రహ్మి" నే బాగుంది అనిపిస్తుంది నాకు. ఏమంటారు?
శీర్షాసనాలు వేస్తే వేసేరు కానీ శీర్షికలు మాత్రం అదరగొడుతున్నారు... మీ కీబోర్డ్ పేరు బావుంది :-) బాగా వ్రాస్తున్నారండీ టపాలు... Keep it up..
బాగుంది. మీసీరియల్లో నేను మాటలు "లాగడానికి" రెడీ!
too much unnayi posts !! Keep it up boss ...
Post a Comment