నేను పాలిటెక్నిక్(డిప్లొమా) చదివేరొజుల్లో మాకు మొదటి సంవత్సరం సిలబస్ లో లెక్కలు కూడా ఉండేది. మా లెక్కల మాష్టారికి లెక్కలతో పాటు ఫిలాసఫీలో కూడా ఏదో పెద్ద డిగ్రీ(ఎం.ఫిల్ అనుకుంటా) ఉండేది. మా లెక్కల మాస్టారు ఫిలాసఫీ తోనే మాకు ఇంట్రడక్షన్ క్లాసు మొదలు పెట్టారు. "ప్రవహించే నీరు రాళ్ళ మీద ప్రవహించినప్పుడు ఎంత అందమైన శబ్దం వస్తుందో, మనం కూడ జీవితం అనే ప్రవాహం లో కష్టాలు అనే రాళ్ళు వచ్చినప్పుడు ఆగిపోకుండా సాగిపోయినప్పుడే మన జీవితం అందంగా అనందంగా మారుతుంది." ఇదీ ఆయన మాకు మొదటి క్లాసులో చెప్పిన మొదటి పాటం. అప్పట్లో ఏమి అర్ధం కాకపొయినా అద్భుతంగా ఉంది అనిపించింది.
తర్వాత క్లాసు నుంచి మాకు లెక్కలు చెప్పటం మొదలుపెట్టారు. బోర్దు మీద ఏదో లెక్క వేసారు. తర్వాత వెంటనే ఆన్సర్ వేసారు. నాకేమి అర్ధం కాలేదు. ఒకడిని లేపి "అర్ధం అయిందా?" అని అడిగారు. వాడు అర్ధం కాలేదు అని చెప్పాడు. ఏమిటోయ్ ఇది కూడ తెలియకపొతే ఎలా? అని కసురుకొన్నారు. ఇంకొకడిని లేపి "అర్ధం అయిందా?" అని అడిగారు. పాపం వాడు వెంటనే అర్ధం అయింది సార్ అని చెప్పాడు. ఇంతే కదోయ్ దీనిలో అర్ధం కాకపోవడానికి ఏముంది అని తేల్చెసారు. దెబ్బతో "రాళ్ళూ-నీళ్ళు" ఫిలాసఫీ నాకు అప్పుడప్పుడే మెల్లిగా అర్ధం అవుతూ ఉన్నట్టు అనిపించింది. ఫస్టు క్లాసులో చెప్పిన ఫిలాసఫీ నెక్స్ట్ క్లాసుకే జీవితం లో ఎదురవడం నాతో పాటు చాలా మంది జీర్ణించుకొలేకపొయారు.
ఈ దెబ్బతో పదో తరగతిలో మా లెక్కల మాష్టారి ప్రియ శిష్యుడైన నాకు లెక్కలంటె భయం వచ్చేసింది. లెక్కల్లో నా పొజిషన్ "Cos O" గా ఫీల్ అయ్యే నేను "Sin O" అయిపొయాను అని తెలుసుకొవడానికి నాకు ఎక్కువ కాలం పట్టలేదు. దీనికి తోడు సర్వాంతర్యామి లాంటి త్రికోణమితి (Trigonometry) త్రికోణమితి లోను, కాలుక్యులస్ లోను , నా మొహం లోను, అన్నిటిలోను ఉండేది. త్రికోణమితి పెట్టినప్పుడు ఒక చాప్టర్ లో పెట్టచ్చు కదా. అన్నిటిలోను ఇదే పెట్టాలా? అసలు నేను లెక్కలు ఎందుకు చెయ్యాలి? భవిష్యత్తులో "C" లో "printf" లు "Java" లో "println" రాయాల్సిన వాడికి ఈ తొక్కలో లెక్కలు అవసరమా? ఇలాంటి కొత్త కొత్త ఫిలాసిఫీలు నాకు కూడా వచ్చేసేవి.
ఫ్రిన్సిపాల్ గారికి చెప్దామా అంటే, అసలే మా లెక్కల మాష్టారు మన ముందు చంద్ర బాబు నాయుడు ని నిలబెట్టి వై.యస్.రాజశేఖర్ రెడ్డి అని మన చేతే ఒప్పించగల సమర్ధుడు. మొదటికే మోసం వస్తుంది అని డ్రాపయిపోయాం.
ఇలాంటి కొన్ని దురదృష్టకరమైన క్లాసుల మధ్య ఆ సంవత్సరం గడిచిపోయింది. పరీక్షలు వచ్చేసాయి. జీవితంలో మొదటి సారి పరీక్షలు అంటే భయపడ్డాను. ఏదో లాగా ఎగ్జాం రాసేసాను. సెలవలు నుంచి వచ్చిన తర్వాత మార్కులు చూసుకుంటె 50 కంటె కొంచెం ఎక్కువ వచ్చాయి. జీవితం లో ఎప్పుడూ 70 కంటె తక్కువ మార్కులు చూడని నేను ఆ మార్కులు చూసి ఏంచేస్తాం అదే ఎక్కువ అని ఫీల్ అవ్వల్సి వచ్చింది.
ఇలా మీరు ఎప్పుడైనా బాధపడ్డారా?
22, జులై 2008, మంగళవారం
లెక్కల మాష్టారి ఫిలాసఫీ
Subscribe to:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
6 Comments:
భాదపడకేం, అందరం పడ్డవాళ్ళమే. మాకు M.C.A లో Theory of Computation అనే ఒక పేపరు ఉంది.ప్రతీసారి ఆ పేపరు చెప్పే ఆయన రాజీనామా చేసి వెళ్ళారు. మిగిలిన స్టాఫ్ తలా ఒక ముక్క చెప్పి సశేశంగా వదిలి పెట్టరు. అసలే సిలబస్ పూర్తికాలేదంటే పరీక్ష లో పేపర్ అరబిక్ కవిత్వం లా ఇచ్చాడు. పరీక్ష రాసాక ఇంటికి వెళ్ళబుద్దికాక, మా స్నేహితుని ఇంట్లో రాత్రి వరకు ఉండి ఇంటికి వెళ్ళా. అప్పటికే ఇక ఈ MCA నాకు వద్దు. నేను సివిల్స్ కోచింగు కి పోతా అని ఇంట్లో అడగాలనుకున్నా. ఎప్పుడూ పరీక్ష నుంచి దిగులుగా రావటం చూడని మా అమ్మకి విషయమర్ధమయ్యి, రకరకాల దేవుళ్ళకి మొక్కుకుంది. ఎదో అత్తెసరు మార్కుల తో ఎలాగో పాసయ్యాను.
ఈ విషయంలో నాకు Electronic Devices and circuits ... నేను ఈ subject కిపడ్డ్ అకశ్టాలు అన్నీ ఇన్నీ కాదు ఇప్పటికీ ఆ పుస్తకం చూసినా ... ఆ విషయాలు గుతుచేసినా ఎక్కడో భయం
మాకూ b-tech లో ఓ లెక్కల మాష్టారు ఉన్నారు
ఆయన దయ వల్ల మొదటిసారి నేను లెక్కలో ఫెయిలు అవుతాను అనుకున్నవాడిని
దేవుడిదయవల్ల పాసయ్యాను
నాది కూడా అదె బాద, 10 వరకు లెక్కల్ని నెను ఆడించాను, పాలిటెక్నిక్(డిప్లొమా)నుంచి అవి నాతొ అదుకొవటం మొదలెంది,
అన్నీ అర్ధమైయ్యేట్లు చెప్పితే.. టీచర్ అని అర్ధం
అర్ధమయ్యీ కానట్లుగా చెప్పితే.. లెక్చరర్ అని అర్ధం
అసలు ఏమీ అర్ధం కాకుండా చెప్పితే.. ప్రొఫెసర్ అని అర్ధం
అంటూ నేనెక్కడో చదివా!! మీ టపా చదివాకా అదే గుర్తు వచ్చింది :-)
Meerante 1st attempt lo pass aiyaru kani nennu maa sir probavam valla 1st attempt lo 13/80 next naa sontha kastam tho 80/80 thechukkuna... naa bada yaevariki chappukonu.. Intha varuku naa jivitham lo aadhe 1st and last time maths lo fail kavadam
Post a Comment