24, జులై 2008, గురువారం

"బగ్గు"వద్గీత - బగ్గులు ఎందుకు వస్తాయంటే?

కలియుగాంతం ఆసన్నమయింది, బ్రహ్మ తర్వాత యుగానికి శ్రీకారం చుట్టడానికి ఈ సారి వెరైటీగా కంప్యూటర్ లో సృష్టి మొదలు పెడదాం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ప్రాక్టీస్ కోసం ఏదైనా సాప్ట్ వేర్ కంపనీ లో చేరదాం అని నిర్ణయించుకొన్నాడు. తనతో పాటు ఇంకొంత మంది దేవుళ్ళని కూడా ప్రాక్టీస్ కి అహ్వానించాడు.

బ్రహ్మ సాప్ట్ వేర్ డెవలపర్ గా జాయిన్ అయ్యాడు. సాప్ట్ వేర్ ని సృష్టించటం బ్రహ్మ పని. బ్రహ్మండంగా కోడింగ్ మొదలుపెట్టాడు. కాని అప్పుడప్పుడు అలవాటులో పొరపాటు గా బగ్గులు కూడా వచ్చేవి.
బ్రహ్మ సృష్టించిన బగ్గుల వల్ల ప్రాజెక్ట్ కేమి సమస్యలు రాకుండ కాపాడడం, స్థితి కారకుడైన విష్ణువు పని కాబట్టి విష్ణు మూర్తి బ్రహ్మ కి టీం లీడర్ గా జాయిన్ అయిపోయాడు.

లయ కారకుడైన మహేశ్వరుడు కూడా టెక్నికల్ డైరెక్టర్ లాగా జాయిన్ అయ్యి బ్రహ్మ, విష్ణువులు సృష్టించి, కాపాడుతూన్న (మెయింటైన్ చేస్తున్న ) ప్రాజెక్ట్ లన్ని లయం(స్క్రాప్) చేస్తూ ఉండెవాడు. పొద్దున్న "C" లో చేసిన ప్రాజెక్ట్ ని స్క్రాప్ చేసి సాయంత్రం "C++" లో చేయమనే వాడు. తర్వాత రోజు దానిని స్క్రాప్ చేసి "java" లో చేయమంటూ తన ధర్మాన్ని నిర్వర్తించేవాడు.

ఈ రకం గా ప్రాజెక్ట్ లన్నీ స్క్రాప్ అవడం తో విసుగు చెందిన విష్ణు మూర్తి, బాగా ఆలోచించి ఇంకా కొంతమందిని టీం లో పెట్టుకుని ఒక్కక్కరి చేత ఒక్కో టెక్నాలజీ లో ప్రాజెక్ట్ డెవలప్ చేయించి ఈ సారి అయినా ప్రాజెక్ట్ "OK" చేయించుకోవలని అనుకున్నాడు. వెంటనే కృష్ణావతారం లో తన అనుంగు మితృడైన అర్జునుడిని, అర్జునుడి కన్నా ప్రతిభా పాటవాలు కల ఏకలవ్యుడిని టీం లో జాయిన్ చేసుకున్నాడు.

ఏకలవ్యుడు ఏ పని ఇచ్చినా తన శక్తి సామర్ధ్యాలతో వెంటనే పూర్తి చేసేసేవాడు. ఒక వేళ తనకి ఆ టెక్నాలజీ రాకున్నా, ఆ టెక్నాలజీని గురు ముఖంగా నేర్చుకోకపొయినా మనసులో గురువు గారిని ధ్యానించుకొని, గూగుల్ లో సెర్చ్ కొట్టి ప్రాక్టీస్ చేసి నేర్చేసుకొనేవాడు(కాపీ పేస్ట్ చేసేవాడు). కాని పాపం అర్జునుడు అలా కాదు. గురు ముఖంగా విననిదే ఏ టెక్నాలజీ నేర్చుకొలేకపోయెవాడు.

ఒక సారి అర్జునుడు చేసిన కోడ్ లో కుప్పలు తెప్పలు గా బగ్గులు వచ్చాయి. సాయంత్రానికి అన్ని బగ్గులు ఫిక్స్ చేయాలని విష్ణు మూర్తి డెడ్ లైన్ ఇచ్చి వెళ్ళాడు. అర్జునుడు మహా భారత యుధ్ధం లో కౌరవ సేన లా ఉన్న బగ్గులని చూసాడు. భయపడ్డాడు, విలపించాడు. అస్త్ర సన్యాసం (రాజీనామా) చేస్తున్నాని ప్రకటించాడు.

అర్జునుడి మాటలు విన్న విష్ణు మూర్తి వెంటనే కృష్ణావతారం లోకి మారిపోయి
"అర్జునా !
బగ్గు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య నాయనా!
బగ్గు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము. అది అగ్నిచే కాల్చబడదు. నీటిచే తడుపడదు. కోడు చే ఫిక్స్ చేయబడదు.!
మానవుడు ఒక వస్త్రాన్ని వదలి వేరొక వస్త్రాన్ని ధరించినట్టు బగ్గు ఒక రూపాన్ని వదలి వేరొక రూపాన్ని ధరిస్తుంది.
నువ్వు ఏం బగ్గు సృష్టించావని నీవు బాధ పడుతున్నావు. ఈ రోజు నీకు అసైన్ చేసిన బగ్గు నిన్న వేరొకరికి అసైన్ కాలేదా, రేపు వేరొకరికి అసైన్ కాదా?"
అని సాప్ట్ వేర్ జీవిత (లైఫ్ సైకిల్) పరమార్ధాన్ని వివరించ గానే దుఃఖాన్ని విడచి కార్యొన్ముఖుడై బగ్గులన్ని ఫిక్స్ చేసాడు.

అప్పటి నుంచి సాప్ట్ వేర్ ఉద్యోగులందరు తమ తమ స్థానాలలో త్రిమూర్తులు, అర్జునుడు, ఏకలవ్యుడు ఏర్పరిచిన సాంప్రదాయాలని పాటిస్తూ బగ్గులని ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుస్తునే ఉన్నారు.

ఈ కథ పది సార్లు పారాయణ చేసిన వారికి పది బగ్గులు తక్కువ వస్తాయి !!!

గమనిక : సరదాకి రాసింది మాత్రమే!

20 Comments:

కొత్త పాళీ said...

good one

మాగంటి వంశీ మోహన్ said...

అదిరింది...:)...

హైలైట్స్:

లయ కారకుడైన మహేశ్వరుడు కూడా టెక్నికల్ డైరెక్టర్ లాగా జాయిన్ అయ్యి బ్రహ్మ, విష్ణువులు సృష్టించి, కాపాడుతూన్న (మెయింటైన్ చేస్తున్న ) ప్రాజెక్ట్ లన్ని లయం(స్క్రాప్) చేస్తూ ఉండెవాడు. పొద్దున్న "C" లో చేసిన ప్రాజెక్ట్ ని స్క్రాప్ చేసి సాయంత్రం "C++" లో చేయమనే వాడు. తర్వాత రోజు దానిని స్క్రాప్ చేసి "java" లో చేయమంటూ తన ధర్మాన్ని నిర్వర్తించేవాడు.


అర్జునా !బగ్గు సృష్టించేది ఎవరు, ఫిక్స్ చేసేది ఎవరు, ఇదంతా మిధ్య నాయనా!బగ్గు ఒక్కటె శాశ్వతము, నిత్యము, సత్యము. అది అగ్నిచే కాల్చబడదు. నీటిచే తడుపడదు. కోడు చే ఫిక్స్ చేయబడదు.!మానవుడు ఒక వస్త్రాన్ని వదలి వేరొక వస్త్రాన్ని ధరించినట్టు బగ్గు ఒక రూపాన్ని వదలి వేరొక రూపాన్ని ధరిస్తుంది.నువ్వు ఏం బగ్గు సృష్టించావని నీవు బాధ పడుతున్నావు. ఈ రోజు నీకు అసైన్ చేసిన బగ్గు నిన్న వేరొకరికి అసైన్ కాలేదా, రేపు వేరొకరికి అసైన్ కాదా?"

Unknown said...

అయ్యో సరదాకి రాసేరా? నేన్నిజమే అనుకోని 10సార్లు పారాయణ చేసాను కదండీ. అంతా మిధ్యేనా? నాకు 10 బగ్గులు తక్కువ రావా?

అజ్ఞాత said...

:) kaLLu teripimcaaru.thanks.

అజ్ఞాత said...

Chala bagundi. Naku nacchindi

మానవుడు ఒక వస్త్రాన్ని వదలి వేరొక వస్త్రాన్ని ధరించినట్టు బగ్గు ఒక రూపాన్ని వదలి వేరొక రూపాన్ని
Hilarious!!!

అజ్ఞాత said...

Same to same Vasu's feelings. Hilarious!

అజ్ఞాత said...

Good One :-)

శ్రీను said...

చాలా బాగుంది

చైతన్య కృష్ణ పాటూరు said...

హ హ హ. కేక పెట్టించారు.

ప్రతాప్ said...

ఆహ్హా ఆహ్హా..
బావుంది మీ బగ్గువద్గీత.
మా అక్క సుపుత్రుడు నన్నో ప్రశ్న అడిగాడు, భగవద్గీత ని కృష్ణుడు అర్జునుడికి చెబితే దాన్ని విన్నది అర్జునుడొక్కడే కదా మరి అది "లీక్" ఎలా అయింది అని. ఈ ప్రశ్న విరిగి నాకు దిమ్మతిరిగింది. అబ్బో వీడికెన్ని తెలివితేటలో కదా?
మరి "బగ్గువద్గీత" ఎలా లీక్ అయిందంటారు? :-)

chandu said...

Pratap
chaalaa baavundayyaaa nee kaamentu...

బ్రహ్మి- సాప్ట్ వేర్ ఇంజినీర్ said...

@కొత్త పాళీ గారు,
@Vamsi M Maganti గారు,
@K గారు,
@radhika గారు,
@Vasu గారు,
@tetageeti గారు,
@vikaTakavi గారు,
@శ్రీను గారు,
@చైతన్య క్రిష్ణ పాటూరు గారు,
చాలా థాంక్స్ అండి.

@ప్రతాప్ గారు
చాలా థాంక్స్ అండి.
ధృతరాష్టుడు కొలువులో ఉన్న సంజయుడు అనే మంత్రి, మహా భారత యుధ్ధాన్ని చూసి ధృతరాష్టుడికి వివరిస్తూ ఉంటాడు. ధృతరాష్టుడు చూడలేడు కదా మరి. అలానే భగవద్గీత చెప్తునప్పుడు విని ధృతరాష్టుడు కి చెప్పాడు అన్నమాట. అసలు భగవద్గీత అంతా సంజయుడు ధృతరాష్టుడికి చెప్తున్నట్టు ఉంటుంది. అది "లీక్" కాదు. అధికార పూర్వకమైన "కాపీ రైటు".

సంజయుడు లాగే నేను కూడా "బగ్గు" వద్గీత చెప్తున్నప్పుడు విని భావి తరాలకి అందిచాలని సుదుద్దేశ్యం తో బ్లాగులోకానికి అందించా !!!

Unknown said...

సూపరు... బ్లాగుల్లేకపోతే సాఫ్టువేరు పురాణాలన్నీ నాకెలా తెలిసేవో ?

Purnima said...

Good one!!

అజ్ఞాత said...

కామెంటు పెట్టక పోతే ఓ పది బగ్గులు ఎక్కువొస్తాయని కూడా పెట్టాలి.

బావుంది.బగ్గు గీత.

-- విహారి

Unknown said...

it is very funny good one

నిజం said...

Excellent.....

Truely said...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Truely said...

Good one.. baaga raasaru

Created Bug never be destroyed but it can be transformed from one form to other bigger form

కన్నగాడు said...

హహహహ.........
చాలా బాగుంది, ఇంకా ఎన్ని పుక్కిటి పురాణాలున్నాయో!

blogger templates 3 columns | Make Money Online